గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (10:01 IST)

బాలయ్య ఎవరో తెలియదా? నాగబాబు ఆ మాటలేంటి? ప్రసన్నకుమార్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి హీరో బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్న మెగాబ్రదర్‌పై ప్రసన్నకుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యుడిగా ఉన్న నాగబాబు.. బాలయ్య ఎవరో తనకు తెలియదనడం సబబు కాదన్నారు. అద్దం ముందు నిల్చుని ఏది కరెక్ట్.. ఏది కరెక్ట్ కాదో సరిచూసుకోవాలన్నారు. 
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర  హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ మంచి స్నేహితులని ప్రసన్న కుమార్ వెల్లడించారు. అలాంటి పరిస్థితుల్లో నాగబాబు వైరం పెంచే వ్యాఖ్యలు చేయడం కూడదని హితవు పలికారు. నిజానికి నాగబాబుది బాలయ్య స్థాయి కాదని, బాలయ్య స్థాయిలో నాగబాబును పోల్చడమా అంటూ ఎద్దేవా చేశారు. బాలయ్యపై లేనిపోని కామెంట్లు చేస్తున్న నాగబాబు వ్యవహారాన్ని ఆయన వివక్షకే వదిలేస్తున్నానని తెలిపారు. 
 
అసలు నాగబాబు ఎందుకిలాంటి కామెంట్లు చేస్తున్నాడో అర్థం కాలేదని.. నాగబాబు కామెంట్స్ ద్వారా వరుణ్ తేజ్ సినిమాలపై ప్రభావం వుంటుందని ప్రసన్న కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.