శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (11:35 IST)

పడక సుఖం ఇవ్వకుంటే అవకాశాలురావు.. శ్రీరెడ్డి

ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మరోసారి టాలీవుడ్‌పై మండిపడ్డారు. అవకాశాల కోసం దిగజారినట్లు ఆమెపై వస్తున్న ఆరోపణలకు స్పందించిన ఆమె తన కెరీర్ కోసం బోల్డ్‌గా మారినట్లు ఒప్పుకున్నారు. టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు, కానీ తమిళ ఇండస్ట్రీలో అలా కాదు, టాలెంట్ ఉంటే ఆఫర్లు ఇస్తారు. అందుకోసమే నేను తమిళ పరిశ్రమకు వచ్చా, కానీ నేను రూ.5 కోట్లు తీసుకుని పారిపోయి వచ్చానంటూ ప్రచారం చేస్తున్నారు. నా బ్యాంక్ అకౌంట్ చూడండి, అందులో లక్ష రూపాయలు కూడా లేదు.
 
నాకు తల్లిదండ్రులు అండగా నిలవకపోయినా నా స్వశక్తిని నమ్ముకొన్నాను. చిన్నప్పటి నుండి పడిన ఇబ్బందులు, సినిమా పరిశ్రమలో ఎదుర్కొన్న కష్టాలు వలన నేను బోల్డ్‌గై మారాను. ఇండస్ట్రీకి వచ్చాక నా వ్యక్తిత్వాన్ని విరుద్ధంగా కొన్ని చేయకూడని పనులు చేశాను. ఎవరైనా పుట్టుకతో వ్యభిచారిగా మారతారా? కొందరు సినీ పెద్దలు, పరిస్థితుల వల్ల నేను అలా చేయాల్సి వచ్చింది. పడుకోకపోతే ఆఫర్స్ రావని చెప్పడం వలనే అలాంటి పనులకు కూడా సిద్ధపడ్డాను. సినీ పరిశ్రమ వల్ల నా జీవితం నాశనమైందా అంటే సమాధానం నా దగ్గర లేదు.
 
ఇక మీడియా అయితే ఒక్కోసారి నన్ను మంచిగా చూపిస్తుంది, మరోసారి టాలీవుడ్‌లో నన్ను బ్యాన్ చేసారంటూ చూపిస్తుంది. వాళ్లేంటి, నేను టాలీవుడ్‌ను, తెలంగాణను బ్యాన్ చేసానంటూ మండిపడింది. నా గురించి బాగా తెలిసినవారికే నేను అర్థమవుతాను. ఒంటరిగా ఉన్నప్పుడు ధ్యానం చేస్తాను, చాగంటి ప్రవచనాలు వింటాను, మీడియాలో వచ్చిన తప్పుడు కథనాల వలన నాపై ఈ ముద్ర పడింది. మీటూ ఉద్యమం ఇప్పటికి బ్రేకులు పడ్డప్పటికీ ఆగిపోలేదు. మళ్లీ శక్తివంతంగా మారి, ఇప్పుడున్న పరిస్థితులలో మార్పు తెస్తుందని హెచ్చరించారు.