సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (15:56 IST)

కారు ప్రమాదంలో సునీల్ మృతి.. అవన్నీ ఉత్తుత్తి వార్తలేనన్న కమెడియన్

సోషల్ మీడియా పుణ్యంతో ఎన్నెన్నో ఫేక్ న్యూస్‌లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రముఖ హాస్యనటుడు సునీల్‌పై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారమైంది. అదేంటంటే.. రోడ్డు ప్రమాదంలో సునీల్ మరణించాడనేదే. అయితే ఇలాంటి వార్తలను నమ్మవద్దని అభిమానులకు సునీల్ విజ్ఞప్తి చేయడంతో.. హమ్మయ్య అంటూ అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 
 
టాలీవుడ్ కమెడియన్ కమ్ హీరో సునీల్ కారు ప్రమాదంలో మరణించారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన్ను కడసారిగా చూసేందుకు టాలీవుడ్ ప్రముఖులు వచ్చినట్లు మార్ఫింగ్ ఫొటోలను వాటికి జతచేశారు. ఈ విషయం సునీల్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తాను క్షేమంగా వున్నానని.. ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ స్పష్టం చేశారు. 
 
దయచేసి ఇలాంటి కథనాలతో ఆందోళనకు గురికావద్దనీ, వీటిని నమ్మవద్దని సునీల్ విజ్ఞప్తి చేశాడు. ఇంకా నకిలీ వదంతులకు సంబంధించిన క్లిప్పింగ్స్‌ను కూడా ట్విట్టర్లో జత చేశాడు.