శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: బుధవారం, 27 మార్చి 2019 (14:40 IST)

బాలక్రిష్ణకు క్షమాపణ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకు?

రాష్ట్రంలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంది. మామూలుగా అయితే ఈ పాటికి స్టార్ కాంపైన్‌తో అన్ని పార్టీలు కళకళలాడిపోతూ ఉంటాయి. అయితే ఆ జోరు ఈసారి కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికార పార్టీ  టిడిపికి ఈసారి స్టార్ కాంపైన్ లేకుండా పోయారట. ఆ భారం మొత్తం ఈసారి ఒక్క బాలయ్య మాత్రమే మోస్తున్నారు.
 
ఎన్టీఆర్ వైపు నుంచి ఎలాంటి ఉలుకుపలుకూ లేదు. అయితే ఎన్టీఆర్ రాకపోవడానికి చాలా కారణాలు వినిపిస్తున్నాయట. బాబాయ్ నందమూరి బాలక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య సాన్నిహిత్యం ఎక్కువైందనడానికి రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కుమారుడి వివాహంలో జై బాలయ్య అంటూ నినాదాలు చేసినదాన్ని బట్టి చెప్పొచ్చు. ఇదే కాదు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా గెస్ట్‌గా కూడా తారక్ వెళ్ళారు. అంతలా బాబాయ్ పైన ప్రేమ వున్నా ప్రచారానికి దూరంగా వున్నారు తారక్.
 
తాజాగా బాలక్రిష్ణకి స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి మాట్లాడారట. తెలుగుదేశం పార్టీలో నేను కూడా ఒకడినే. అయితే మా నాన్న హరిక్రిష్ణకు ఒక మాటిచ్చాను. నేను కొన్ని నెలల పాటు రాజకీయాల జోలికి వెళ్ళనని.. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి ఈ ఒక్కసారికి క్షమించండి అని ఫోన్ పెట్టేశారట. జూనియర్ ఎన్టీఆర్ అలా అనగానే బాలక్రిష్ణ కూడా సైలెంట్ అయిపోయారట.