సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (09:36 IST)

ఇప్పటికి పవన్‌కే... తర్వాత జూనియర్‌కు మద్దతిస్తా : మంచు మనోజ్

సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్న అంశంపై టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కుమారుడు, సినీ హీరో మంచు మనోజ్ స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు మనోజ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పోటీ చేస్తారంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన తనదైనశైలిలో సమాధానమిచ్చారు.
 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌  డబ్బులు చెల్లించక పోవడంతో మోహన్ బాబు నిరసన తెలిపారు. ఇది హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంచు మనోజ్ ఏపీ ప్రజలకు ఓ లేఖ రాశారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా చర్చ సాగుతోంది. ఇదే తరుణంలో, రాజకీయానికి సంబంధించిన ప్రశ్నలూ మంచు మనోజ్‌పై నెటిజన్లు సంధించారు. 
 
ఈ ఎన్నికల్లో మద్దతు ఎవరికి ఇస్తున్నట్లో తెలపాలని ఓ నెటిజన్ కోరాడు. దానికి మనోజ్ అస్సలు ఆలోచించకుండా.. 'నా సపోర్ట్ ఎప్పటికీ జనసేనకే..' అని రిప్లయ్ ఇచ్చారు. మరో నెటిజన్.. మీరు జనసేనకి సపోర్టా లేక టీడీపీకా బ్రో.. దయచేసి క్లారిటీ ఇవ్వండి అని ట్వీట్ చేయగా.. 'జనసేన బ్రదర్.. దౌంట్లో మళ్లీ డౌటా..?' అంటూ మనోజ్ రిప్లయ్ ఇచ్చారు.
 
ఇంకో నెటిజన్ 'ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారన్నది నీ ఇష్టం. కానీ, ఐదు లేదా పది సంవత్సరాల తర్వాత తారక్ అన్న(జూనియర్ ఎన్టీఆర్) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే..' అని ప్రశ్నించాడు. 'తారక్ వస్తే ఇంకా నేను ఎటు వెళ్తాను తమ్ముడూ?! నా మిత్రుడి రాక కోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు' అని మనోజ్ సమాధానమివ్వడం గమనార్హం.