మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By జె
Last Modified: శనివారం, 6 ఏప్రియల్ 2019 (17:42 IST)

పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వరుణ్‌..!

సినీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు వరుణ్‌ తేజ్. రాజకీయాల గురించి అసలేమీ తెలియకపోయినా తన తండ్రి, బాబాయ్ కోసం రాజకీయ ప్రచారం చేస్తున్నారు వరుణ్‌ తేజ్. బాగా ఆలోచించి ఎన్నికలకు ఐదురోజుల ముందు మాత్రమే ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు. 
 
తన తండ్రి నాగబాబు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఒకవైపు తండ్రికి మద్ధతుగా, మరోవైపు బాబాయ్ పవన్ కళ్యాణ్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్థతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వరుణ్ తేజ్ ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యంలో యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకున్నారు. 
 
జై జనసేన అంటూ నినాదాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ వల్ల మార్పు సాధ్యమవుతుందని, సిఎంగా బాబాయ్ పీఠమెక్కడం ఖాయమంటున్నారు వరుణ్ తేజ్. అంతేకాకుండా తన తండ్రి కూడా రాజకీయాల్లో రాణిస్తారని, ఆయన గెలుపు కూడా ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు వరుణ్‌ తేజ్.