పెళ్ళయిన తరువాత కొడుకు, కోడలిలో మార్పు వచ్చిందంటున్న నాగ్

Nagarjuna
జె| Last Modified శనివారం, 6 ఏప్రియల్ 2019 (13:40 IST)
నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీరిరువురు వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన తరువాత వీరు కలిసి నటించిన సినిమా తాజాగా విడుదలైంది. అదే మజిలీ. మనం, ఏమాయే చేశావే సినిమాల తరువాత నాగచైతన్య, సమంతలు నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనా పెరిగింది.

సినిమా శుక్రవారం విడుదలైంది. సినిమా హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతుండటంతో నాగార్జున్ ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ చేశారు. నాగచైతన్య, సమంతలకు వివాహమైన తరువాత ఇద్దరిలోను నటనా ప్రతిభ మరింత పెరిగింది. మజిలీ సినిమాలో అద్భుతంగా ఇద్దరూ నటించారు. వారికి నా ఆశీస్సులు.

మనం సినిమా తరువాత ఈ సినిమా అంతటి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. నేను సినిమా చూశాను. చాలా చాలా బాగుంది. వీరిద్దరితో పాటు రావూ రమేష్ మిగిలిన నటులు బాగా నటించారంటూ కితాబిచ్చారు నాగార్జున.దీనిపై మరింత చదవండి :