గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (21:39 IST)

'మజిలీ'తో మాయ చేసిన చైసామ్... పిండేశారుగా(రివ్యూ)(Video)

ఏ మాయ చేశావె చిత్రంలో ప్రేమికులుగా నటించి మెప్పించిన నాగచైతన్య-సమంత జంట పెళ్లాయ్యాక నటించిన తొలి చిత్రం మజిలీ. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. మరోవైపు నాగచైతన్య భారీ విజయాన్ని చేజిక్కించుకోవడంలో ఇబ్బందిపడుతున్నాడు.

ఈ స్థితిలో తన భార్య సమంతతో కలిసి నటించే ధైర్యం చేశాడు. నిజానికి ఇలాంటి ధైర్యం ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే పెళ్లయ్యాక కాంబినేషన్ చాలామందికి వర్కవుట్ కాదనే సెంటిమెంట్ వుంది. మరి ఈ సెంటిమెంటును చైసామ్ ఏం చేశారో చూడాలంటే సినిమా రివ్యూలోకి వెళ్లాల్సిందే.
 
‘నిన్ను కోరి’ చిత్రంతో మెప్పించిన శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన మజిలీ చిత్రం ప్రేమకథ ఇతివృత్తంగా సాగింది. కథలో పాత్రలలోకి వెళితే... మంచి క్రికెట‌ర్‌గా ఎద‌గాల‌నేది పూర్ణ (నాగ‌చైత‌న్య‌) ఆశ కాగా అతడి జీవితంలోకి అన్షు(దివ్యాన్ష) అనే యువతి ప్రవేశిస్తుంది. ఆమెను తొలి ప్రేమలోనే ప్రేమించేస్తాడు. ఐతే చాలామంది ప్రేమికుల్లానే వీరికి పెద్దలు అడ్డంకిగా మారుతారు. అన్షు ఇంట్లో ఆమె పేరెంట్స్ ఈ పెళ్లికి అంగీకరించకపోగా ఆమెకి మరో అబ్బాయితో పెళ్లి చేసేస్తారు. 
 
కానీ ప్రేమించిన అన్షు దూరమవడంతో పూర్ణ మనిషి కాలేకపోతాడు. చివరికి పూర్ణ పేరెంట్స్ ఒత్తిడి మేరకు ఎదురింటి అమ్మాయి శ్రావణి(సమంత)తో పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతుంది కానీ అతడి మనసంతా అన్షు నిండిపోయి వుంటుంది. దానితో శ్రావణిని దూరం పెడుతూ వస్తాడు. ఐతే ఓ అనుకోని సంఘటనతో పూర్ణ-శ్రావణిలు దగ్గరవుతారు. అదేంటి? మాజీ ప్రేమికురాలు అన్షు ఏమవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే చిత్రాన్ని చూడాల్సిందే.
 
నటీనటుల పెర్ఫార్మెన్స్
నాగచైతన్య-సమంత నటన అద్భుతంగా వుందని చెప్పొచ్చు. క్రికెటర్‌ అవుదామనుకొనే ఒక ఆస్పేరింగ్‌ యంగ్‌ క్రికెటర్‌ పూర్ణ దాన్ని అందుకోలేకపోతాడు. ఈ పాత్రలో నాగ చైతన్య బాగా నటించాడు. అతడు 34 ఇయర్స్‌కి వచ్చినప్పుడు గతంలోంచి బయటకు రావడానికి ఇష్టపడడు. అతన్ని గతంలోంచి బయటకు లాగాలని ట్రై చేసే ఒక భార్యగా సమంత నటన అదిరిపోయింది. వాళ్ళిద్దరి మధ్య కాన్‌ఫ్లిక్ట్‌ ఎలా సాగిందనేది చెప్పేకంటే చూడాల్సిందే. భార్య క్యారెక్టర్‌లో సమంత నటించలేదు జీవించేసింది.
 
సమంత ఇప్పటివరకూ తనకు వచ్చిన అన్ని పాత్రలు చాలా బాగా చేసింది. కానీ చైతన్య ఎంత ఎక్స్‌ట్రార్డినరీగా చేయగలడనేది ఈ సినిమాలో చూస్తే తెలుస్తుంది. శ్రావణి పాత్రకు సమంత పూర్తి న్యాయం చేసింది. వీరిద్దరూ నటనలో ఒకరితో ఇంకొకరు పోటీపడి నటించారు. ఇక మిగిలిన పాత్రలు కూడా వారి పరిధి మేరకు నటించి మెప్పించారు. నాగచైతన్యకు మజిలీ హిట్ చిత్రాల జాబితాలో చేరుతుందని అనుకోవచ్చు. వీడియో చూడండి..