శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (11:52 IST)

కింగ్ చేయలేకపోయాడు.. నాగచైతన్య చేసి చూపించాడు...

కింగ్ నాగార్జున చేయలేకపోయిన ఒక పనిని... ఇప్పుడు ఆయన కొడుకు నాగ చైతన్య చేసి చూపించేసాడని చెప్పుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇంతకీ విషయం ఏమిటంటే.. నాగార్జున, తన తోటి నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లికి ముందు వీళ్లిద్దరూ చాలా సినిమాలలో కలిసి నటించినప్పటికీ... పెళ్లయిన తర్వాత ఒక్కసారి కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే... ఈ జాబితా నాగార్జున, అమల జంటకు మాత్రమే పరిమితం కాకుండా ఇదే రూట్లో హిట్ పెయిర్లుగా పేరుపొందిన రాజశేఖర్, జీవిత.. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్.. మహేష్, నమ్రత.. శ్రీకాంత్, ఊహలు కూడా పెళ్లి తర్వాత కలిసి నటించలేకపోయారు. 
 
కానీ నాగ చైతన్య మాత్రం పెళ్లికి ముందు సమంతతో మూడు సినిమాలలో కలిసి నటించాడు. అటుపై పెళ్లయిన తర్వాత ‘మహానటి’లో వీళ్లిద్దరు నటించినప్పటికీ... జోడీగా నటించలేదు. అయితే ‘మజిలీ’ సినిమాలో భార్యా భర్తలుగా నటించడం విశేషం. ఈ రకంగా నాగార్జున పెళ్లి తర్వాత అమలతో యాక్ట్ చేయలేకపోయినప్పటికీ.. నాగచైతన్య మాత్రం పెళ్లయిన తర్వాత తన నిజ జీవిత భాగస్వామి సమంతతో కలిసి నటించడం విశేషం. ఈ రకంగా నాగార్జున చేయలేకపోయిన పనిని చేసి చూపించిన నాగ చైతన్య తండ్రిని మించిన తనయుడా?? ఏమో మరి. వేచి చూడాల్సిందే.