శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 1 ఏప్రియల్ 2019 (20:15 IST)

షాకింగ్ - మ‌జిలీ టీజ‌ర్ నాగార్జున‌కి న‌చ్చ‌లేదు..!

అక్కినేని నాగ చైత‌న్య - స‌మంత అక్కినేని జంట‌గా న‌టించిన తాజా చిత్రం మజిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ సినిమా ఉగాది కానుక‌గా ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు కింగ్ నాగార్జున - విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో నాగార్జున మాట్లాడుతూ... టీజ‌ర్ చూసాను. అందులో చివ‌రన వెధ‌వ‌ల‌కే మంచి భార్య‌లు వ‌స్తారు అని చెప్పారు.
 
ఆ డైలాగ్ విన్న‌ప్పుడు మ‌న‌సు చివుక్కుమంది. ఎందుకంటే... స‌మంత మంచిది. అలాగే చైత‌న్య కూడా చాలా మంచోడు. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే... చాలా చాలా బాగుంది. కాన్ఫిడెన్స్ టీమ్ అంద‌రిలో కనిపిస్తుంది. డైరెక్ట‌ర్ శివ చాలా క్లియ‌ర్‌గా త‌న‌కు ఏం కావాలో చైత‌న్య‌, స‌మంత ద‌గ్గ‌ర మంచి న‌ట‌న‌ను రాబ‌ట్టాడు. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రోజు అభిమానుల‌కు ఒక పెద్ద పండ‌గ‌లా ఉంటుంది అనిపిస్తుంది. టీమ్ అంద‌రికీ థ్యాంక్స్ అని చెప్పారు.