శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (14:49 IST)

"మన్మథుడు-2"లో లవంగం పాత్రలో వెన్నెల కిషోర్

అక్కినేని నాగార్జున నటించిన చిత్రం 'మన్మథుడు'. గతంలో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ సూపర్ హిట్ సినిమా ఇది. ఈ చిత్రం సీక్వెల్‌ను ఇపుడు తీస్తున్నారు. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జునే స్వయంగా అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. 
 
అయితే, నాగార్జున కెరీర్‌లో 'మన్మథుడు' ఎలాంటి హిట్ కిక్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ పరంగా సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. 
 
మన్మథుడు చిత్రంలో లవంగం పాత్రలో బ్రహ్మానందం జీవించాడు. ఇపుడు ఆ పాత్రను యువ హాస్య నటుడు వెన్నెల కిషోర్ పోషించనున్నాడు. మరి బ్రహ్మనందాన్ని వెన్నెల కిషోర్ మెప్పించే విధంగా నటిస్తాడా... త్రివిక్రమ్‌‌ను తలపించే విధంగా రాహుల్ డైలాగులు ఉంటాయో లేదో వేచిచూడాల్సిందే. ఈ చిత్రం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.