సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (13:04 IST)

రాజు గారి గ‌ది 3లో నాగార్జున న‌టిస్తున్నాడా..?

ఓంకార్ రాజు గారి గ‌ది అనే చిన్న‌ సినిమాతో పెద్ద‌ విజ‌యం సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసారు. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో రాజు గారి గ‌ది 2 సినిమా తీసారు. ఇందులో నాగార్జున‌, స‌మంత న‌టించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే.. ఆశించిన స్ధాయిలో కాక‌పోయినా.. ఫ‌ర‌వాలేద‌నిపించింది. ఇప్పుడు ఓంకార్ రాజు గారి గ‌ది 3 ప్లాన్ చేస్తున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఇందులో నాగార్జున న‌టించ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. నాగార్జున ప్ర‌స్తుతం మ‌న్మ‌ధుడు 2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 25 నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ త‌ర్వాత జూన్ నుంచి బంగార్రాజు చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. 
 
మ‌రి..ఈ రెండు సినిమాల త‌ర్వాత రాజు గారి గ‌ది 3లో న‌టిస్తారా..? లేక వేరే హీరో ఇందులో న‌టిస్తారా అనేది తెలియాల్సివుంది. మ‌రి.. ఓంకార్ త్వ‌ర‌లో అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.