''బ్రహ్మాస్త్ర'' నుంచి లోగో విడుదల.. (వీడియో)
బ్రహ్మాస్త్ర సినిమా నుంచి తెలుగు లోగో విడుదలైంది. అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ లోగో బాలీవుడ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు లోగోను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన తెలుగు లోగోను విడుదల చేసినందుకు సంతోషంగా ఉందని జక్కన్న ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం వచ్చే క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాగా బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత అన్ని ఇండస్ట్రీస్‌లో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కోవలో బాలీవుడ్‌లో 'బ్రహ్మాస్త్ర' అనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు.
''ఈ వీడియోలో బ్రహ్మాస్త్రం గురించి.. రణ్‌వీర్ కపూర్ అడుగుతుంటాడు. దానికి నాగార్జున అదే మొత్తం బ్రహ్మాండంలో ఉన్న శక్తి అంతా నింపుకున్న అద్వితీయ అస్త్రం బ్రహ్మాస్త్రం గురించి చెబుతాడు. ఈ వీడియోను ఓ లుక్కేయండి.