ట్రెండింగ్- సెల్ఫీ విత్ స్లిప్పర్... అమితాబ్ ఏమన్నారంటే?

Last Updated: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:13 IST)
సెల్ఫీల కోసం ఎగబడే వారు రోజు రోజుకీ పెరిగిపోతోంది. సెల్ఫీ కోసం ఎంతటి సాహసానికైనా తెగబడుతున్నారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా కొందరు తీసుకునే సెల్ఫీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చిన్నారుల సెల్ఫీ మాత్రం స్మార్ట్ ఫోన్ తీసుకోకుండానే వైరల్ అవుతోంది.


అదెలాగంటే.. ఓ చెప్పుతో చిన్నారులు సెల్ఫీ తీసుకునే ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలెబ్రిటీలు కూడా ఈ ఫోటో స్పందిస్తున్నారు.
 
బాలీవుడ్ సెలబ్రిటీలు అనుపమ్ కేర్, సునీల్ శెట్టి, అతుల్ కస్బేకర్, అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ లాంటి వారు ఈ సెల్ఫీపై కామెంట్స్ చేశారు. ఈ చిన్నారుల అమాయకత్వం, ఉన్నదాంట్లో సంతృప్తి పడే గుణానికి హ్యాట్సాఫ్ అంటున్నారు. అయితే బిగ్ బి మాత్రం భిన్నంగా స్పందించారు. తనను క్షమించాలని అడుగుతూ.. ఈ ఫోటో ఫోటోషాప్ చేసిందనుకుంటా. 
 
ఎందుకంటే.. ఆ పిల్లాడు చెప్పును పట్టుకున్న చేయి.. అతడి మిగితా శరీర భాగాలకు సరితూగడం లేదు.. అంటూ ట్వీట్ చేశారు. బిగ్ బి ట్వీట్ నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఆ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి.దీనిపై మరింత చదవండి :