శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2019 (13:16 IST)

''వెంకీ మామ'' నుంచి కొత్త పోస్టర్..

చైతన్య నటించిన ''మజిలీ'' శుక్రవారం విడుదలై మంచి హిట్‌ అందుకుంది. వెంకీ ఇటీవల ''ఎఫ్2'' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం వెంకీ మామ సినిమాలో కనిపిస్తున్నారు. తద్వారా దగ్గుబాటి, అక్కినేని ఫ్యాన్స పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి ''వెంకీ మామ'' చిత్ర బృందం టైటిల్‌ లోగోను విడుదల చేసింది. 
 
వెంకటేశ్‌, నాగచైతన్య కథానాయకులుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ వెంకీమామలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. కేఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
అనూప్‌ రూబెన్స్‌ బాణీలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్‌ లోగోను విడుదల చేశారు. ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని డిజైన్‌ చేశారు. 

''వెంకీమామ'' చుట్టూ 12 రాశుల గుర్తుల్ని ఉంచారు. ఓ పక్క పల్లె వాతావరణం, మరోపక్క శత్రువులతో పోరాడుతున్న సైనికుల్ని చూపించారు. ఈ సినిమా టీజర్‌లో నాగచైతన్య, వెంకీ కనిపించారు. ఈ చిత్రం ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోందని సినీ యూనిట్ వెల్లడించింది.