సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: బుధవారం, 8 మే 2019 (20:49 IST)

కాబోయే భార్యతో అలా ప్రాక్టీస్ చేస్తున్నా... పెళ్లయ్యాక కూడా ఇంతేనా అంటోంది...

మా పెళ్లికి పెద్దలు అంగీకరించారు. పెళ్లి చేసుకునేందుకు మరికాస్త టైముంది. ఈలోపు మేమిద్దరం ఒకరికొకరు ఫోర్ ప్లే చేసుకుంటూ తృప్తిని అనుభవిస్తున్నాం. ఆమె సున్నిత భాగాలపై స్పర్శిస్తుంటే ఆమె తృప్తి పడుతుంది. తర్వాత ఆమె కూడా నన్నలాగే చేస్తుంది.

ఐతే ఆమె అలా చేస్తుందో లేదో వెంటనే వీర్యం స్ఖలనమైపోతోంది. ఇది చూశాక... పెళ్లాయక కూడా ఇలాగే నిమిషాల్లో ఔటైపోతావా అని ప్రశ్నించింది. ఇక అప్పట్నుంచి నాలో తెలియని ఆందోళన మొదలైంది. పెళ్లయ్యాక నిజంగా ఆమెను తృప్తిపరచలేనేమోనన్న అనుమానం వస్తోంది... నిజమేనా?
 
మీది అర్థం లేని భయం. పెళ్లి కాకుండా హద్దులు దాటి ప్రవర్తిస్తే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి. శృంగారం అనేది సహజ క్రియ. దానిని ప్రతిసారీ అదిమిపెడుతూ ఉంటే సమస్య ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా ఫోర్ ప్లే సమయంలో ఆమె ఏ రీతిలో స్పర్శిస్తుందో తెలియదు కనుక ముందు ఆ పనిని ఆపేయమనండి. కొంతకాలం ఇలాంటి ఆలోచనలకు బ్రేక్ వేసి కెరీర్ పైన ఇద్దరూ దృష్టి సారించండి. పెళ్లయ్యాక ఆ సుఖాన్ని చవిచూసేందుకు చాలా సమయం ఉంటుంది.