మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 10 మే 2019 (17:04 IST)

ప్రేయసి పైశాచికానందం... టీనేజ్ అమ్మాయిల నగ్న వీడియోలు తీసి ప్రియుడికి షేర్

సెల్ ఫోన్లు వచ్చాక సెల్ఫీలు, వీడియోల పిచ్చి ముదిరిపోయింది. ఐతే వీటన్నిటినీ కొందరు దాటేసి పిచ్చి పనులు చేస్తున్నారు. ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందించే ఓ నర్స్ చేయరాని పని చేసింది. రోగులను కాపాడాల్సిన ఆమె వారి నగ్న ఫోటోలను తీసింది.
 
వివరాల్లోకి వెళితే... పెన్సిల్వేనియాలోని అల్లెఘెనీలో నర్సుగా పనిచేస్తున్న 30 ఏళ్ల అస్లే ఓ కమ్యూనీటి లివింగ్ సెంటర్లో విధులు నిర్వహిస్తోంది. ఆసుపత్రికి వచ్చే మహిళా రోగులను పరీక్షల నిమిత్తం దుస్తులు తీసేసి నగ్నంగా మార్చేసేది. ఆ తర్వాత వారి నగ్న వీడియోలను తీసుకునేది. వాటిని తన ప్రియుడికి షేర్ చేస్తూ వచ్చింది. 
 
ఈవిధంగా మొత్తం 17 మంది బాలికలు, టీనేజ్ అమ్మాయిల నగ్న వీడియోలను, ఫోటోలను తీసి పంపింది. ఆమె వాలకంపై అనుమానపడ్డ కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫోన్ తనిఖీ చేయగా నగ్న వీడియోలు, ఫోటోలు బయటపడ్డాయి. వాటిలో రెండేళ్ల చిన్నారి నగ్న ఫోటోలు కూడా వున్నాయి. దీనితో ఆమెకు కఠినమైన శిక్ష విధించే అవకాశం వున్నదంటున్నారు.