సంబంధిత వార్తలు
- అతడి ఒంట్లో కరెంట్ వుందా... తాకితే వెలుగుతున్న బల్బ్(Video)
- టిక్-టాక్‌లో మహిళా పోలీస్ సూపర్ డ్యాన్స్... సస్పెండ్: ప్లీజ్ అంటున్న నెటిజన్స్
- నాయనమ్మతో వాకింగ్.. బాలుడి కిడ్నాప్.. తల్లడిల్లిపోతున్న నిండు గర్భిణి..
- పాయల్ రాజ్‌పుత్ ప్రేమలో పడిందా? ఫోటోలోని వ్యక్తి ఎవరు?
- బోయపాటి... బాలయ్య క్యాంప్ నుంచి చిరు క్యాంప్‌లోకి వచ్చారా..?
టిక్ టాక్ పిచ్చి.. వరద నీటితో ఓవరాక్షన్.. కొట్టుకుపోయాడు..
టిక్ టాక్ పిచ్చి మాత్రం జనాల్లో ఏమాత్రం తగ్గలేదు. బీహార్‌లో వర్షం బీభత్సం కారణంగా వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద నీటిలో టిక్‌టాక్ చేయబోయి.. ఉద్ధృతికి కొట్టుకుపోయాడు ఓ యువకుడు. మూడు రోజుల క్రితం అద్దావ్‌పూర్‌కి చెందిన అఫ్జల్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి టిక్‌టాక్ చేసేందుకు వరద నీటి వద్దకు వెళ్లాడు.
తొలుత అప్జల్ స్నేహితుడు నీటిలో డైవ్ చేయగా, ఆ తరువాత అఫ్జల్ కూడా దూకాడు. అయితే, వరద ఉద్ధృతి కారణంగా అప్జల్ కొట్టుకుపోయాడు. వెంటనే అతడి స్నేహితుడు అధికారులకు సమాచారం ఇవ్వగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. సహాయక సిబ్బంది అప్జల్ మృతదేహాన్ని కనుగొన్నారు.
