బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: గురువారం, 25 జులై 2019 (19:21 IST)

టిక్-టాక్‌లో మహిళా పోలీస్ సూపర్ డ్యాన్స్... సస్పెండ్: ప్లీజ్ అంటున్న నెటిజన్స్

తెలంగాణలో విధులకు హాజరై కార్యాలయంలోనే టిక్-టాక్ పాటలతో ఎంజాయ్ చేసిన ఉద్యోగులు ఏమయ్యారో తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో గుజరాత్‌లో ఓ మహిళా పోలీసు హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ టిక్-టాక్‌లో కనిపించింది. దాంతో ఆమెను సస్పెండ్ చేశారు అధికారులు.
 
వివరాల్లోకి వెళితే... అర్పితా చౌదరి గుజరాత్ మహీనా జిల్లాలో పోలీసు అధికారి. ఆమెకు టిక్-టాక్ అంటే మహా క్రేజ్. ఆ క్రేజుతోనే పోలీస్‌స్టేషన్‌లో ఎవరూ లేనప్పుడు, హిందీ పాట పాడుతూ టిక్-టాక్‌తో పంచుకోవడమే కాకుండా షేర్ చేసేసింది.
 
ఈ వీడియో కాస్తా విస్తృతంగా ప్రచారం జరిగి అలాఅలా అధికారుల దృష్టిలో పడటంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఐతే విధులలో అలా సరదాగా వున్న మహిళా పోలీసును సస్పెండ్ చేయవద్దని నెటిజన్లు ఆమెకి మద్దతు తెలుపుతున్నారు. మరి దీనిపై అధికారులు ఏమయినా పునరాలోచన చేస్తారేమో... ఈ వీడియో చూడండి.