సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: గురువారం, 25 జులై 2019 (16:24 IST)

ప్రియురాలితో భర్త కామకేళి.. అతడిని అలా తీసుకొచ్చి భార్య ఏం చేసిందంటే..?

హైదరాబాద్ నిజాంపేటలో భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. భార్యను నిర్లక్ష్యం చేసి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను చెప్పుతో కొట్టింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్మణ్‌కు, లక్కారం గ్రామానికి చెందిన సౌజన్యతో తొమ్మిదేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
 
అయితే గత కొన్నిరోజులుగా భార్యాపిల్లలను లక్ష్మణ్ దూరంగా ఉంచుతున్నాడు. కరీంనగర్ జిల్లా వెంకట్రావుపేటకు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న సౌజన్య న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయితే పోలీసుల నుంచి సరైన స్పందన రాలేదు. మరో మహిళతో లక్ష్మణ్ నిజాంపేటలో నివాసముంటున్నట్లు ఆమె తెలుసుకుంది. దీంతో నేరుగా తన అన్నను వెంటపెట్టుకుని వెళ్ళింది. అప్పటికే భర్త ప్రియురాలితో మంచి రసపట్టులో ఉన్నాడు. నగ్నంగా ఉన్న భర్తను లాక్కుని వచ్చి మరీ చెప్పుతో కొట్టింది భార్య. అంతేకాదు ప్రియురాలిని చావబాదింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.