శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (14:33 IST)

పొరుగింటి కుక్కతో పెంపుడు కుక్క అక్రమ సంబంధం పెట్టుకుందనీ...

ఓ యజమాని ఓ కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. అయితే, ఈ కుక్క పొరుగింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే.. యజమానికి కోపం వచ్చింది. ఆ కుక్కను మందలించలేక, కొట్టలేకకుమిలిపోయాడు. ఇక లాభం లేదనీ, తను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కుక్కను వదిలివేశాడు. ఈ విచిత్ర ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాజధాని తిరువనంతపురం చకాయిలోని వరల్డ్‌ మార్కెట్‌‌కు చెందిన ఓ వ్యక్తి తనకు ఇష్టమైన మేలు జాతి కుక్కను పెంచుకున్నాడు. కానీ, ఈ కుక్క పొరుగింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో ఆ యజమాని కుక్కను వదిలివేశాడు. ఆ కుక్క మెడలో ఓ చిటీ రాసి దారంతో వేలాడదీశాడు.
 
అందులో 'నిజానికి ఇది చాలా మంచి కుక్క. దీని ఆహారానికి కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయలేదు. ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదు. ప్రతి ఐదు రోజులకోసారి స్నానం చేస్తుంది. కేవలం పాలు, బిస్కెట్లు, కోడిగుడ్లు మాత్రమే తీసుకుంటుంది. మూడేళ్ల కాలంలో ఒక్కరిని కూడా కరవలేదు. ఇటీవల కాలంలో పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే సమస్యగా మారింది. అందుకే ఈ పెంపుడు కుక్కను బయటకు పంపించాల్సి వచ్చింది' అని అందులో యజమాని రాశాడు.
 
ఆయితే, ఈ కుక్క సమాచారం గురించి స్థానికులు పీపుల్ ఫర్ ఏమినల్ వాలంటీర్ శామీన్‌కు తెలిపారు. వారువచ్చి ఆ కుక్కను చేరదీశాడు. దీనపై శామీన్ సిబ్బంది స్పందిస్తూ, అనారోగ్యం పాలైనప్పుడు మాత్రమే కుక్కలను బయట వదిలివేయడం చూశాం.. కానీ అక్రమ సంబంధం పేరిట కుక్కలను వదిలేయడం చూడలేని వాలంటీర్ చెప్పుకొచ్చాడు.