మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (14:53 IST)

కేరళలో బాలికలను అలా వేధించిన ఫాదర్.. అరెస్ట్

కేరళలోని ఓ చిన్నారుల ఆశ్రమంలో బాలికలను లైంగికంగా వేధించిన ఫాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ, కొచ్చికి సమీపంలోని ఓ చిన్నారుల ఆశ్రమంలో పేద విద్యార్థులు బస చేస్తుంటారు. ఈ ఆశ్రమంలో ఉచిత విద్యను పేద విద్యార్థులకు అందిస్తుండేవారు. 
 
ఈ నేపథ్యంలో ఈ ఆశ్రమాన్ని నిర్వహించే ఫాస్టర్ జార్జ్.. ఆశ్రమంలోని బాలికలను లైంగికంగా వేధించాడు. 40 ఏళ్ల జార్జ్ బాలికలను వేధించడంతో బాలికలు ఆ ఆశ్రమం నుంచి పారిపోయారు. 
 
ఇంకా మరికొందరు బాలికలు ఫోన్లలో తల్లిదండ్రులకు విషయం చేరవేశారు. దీంతో బాలికల తల్లిదండ్రులు జార్జ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్కో చట్టం కింద జార్జ్‌ను అరెస్ట్ చేశారు.