సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 3 జులై 2019 (16:37 IST)

కోర్టుకు వెళ్తూ వెళ్తూ.. ఖైదీతో స్టెప్పులేసిన ఖాకీలు (video)

టిక్ టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నాపెద్ద లేకుండా టిక్ టాక్‌లో డబ్ స్మాష్, పాటలకు డ్యాన్స్‌లు వేయడం వంటివి చేస్తూ పోస్టు చేస్తుంటారు.

తాజాగా కేరళలో కోర్టుకు వెళ్ళకుండా ఖైదీతో పోలీసులు డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చాలా ఫన్నీగా వుండటంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళలో నలుగురు పోలీసులు ఓ ఖైదీని కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టుకు వెళ్లేదారిలో బండిని ఆపిన పోలీసులు.. ఓ మలయాళ పాటకు స్టెప్పులేశారు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి కొందరు నవ్వేసి మిన్నకుండిపోతే.. మరికొందరు మాత్రం పోలీసులు ఇలా ఖైదీలతో డ్యాన్సులు వేయడం ఏమిటని ఫైర్ అవుతున్నారు.