బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: బుధవారం, 26 జూన్ 2019 (15:44 IST)

చంద్రబాబును సిఎం అంటూ నాలుక కరుచుకున్న సీఎం జగన్.. ఎక్కడ?

పరిపాలనపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నారు. నిన్న జరిగిన ఎస్పీల సమావేశంలో ఉన్నట్లుండి జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో తప్పులు దొర్లాయి. అది కూడా తాను సిఎం అన్న విషయాన్ని మర్చిపోయారేమో జగన్. సిఎం చంద్రబాబుగారు ఇక్కడే ఉంటారు. అక్రమ బిల్డింగ్ అంటూ చెబుతూ... నాలుక కరుచుకున్నారు.
 
ప్రజావేదిక కూల్చివేతపై మాట్లాడుతూ ఉన్నట్లుండి జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలపై ఎస్పీలందరూ ఆశ్చర్యపోయారు. కాసేపటికి సర్ సిఎం కాదు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సారీ.. మాజీ సిఎం గారు అంటూ జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జగన్ వాయిస్ కాస్త వైరల్‌గా మారుతోంది. టిడిపి నాయకులు వాట్సాప్‌లలో వైరల్ చేసేస్తున్నారు. 
 
అసలు జగన్ సిఎం అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సిఎం అంటే చంద్రబాబే అన్న విషయాన్ని జగన్ మనస్సులో ఇప్పటికీ ఉంది. అందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారంటూ నెటిజన్లు వాట్సాప్‌లలో కామెంట్లు కొడుతున్నారు. మీరే సిఎం అన్న విషయం గుర్తుంచుకోండి అంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు.