శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 25 జూన్ 2019 (19:46 IST)

జగన్ గారు.. రేప్‌లు చేసేది మీ పార్టీ వాళ్ళే... నారా లోకేష్

ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ట్విట్టర్ ద్వారా విమర్శించారు నారా లోకేష్‌. ఒంగోలులో బాలికపై అత్యాచారం చేసిన వారిలో మీ పార్టీ కార్యకర్త కూడా ఉన్నారు. అతను మీతో సెల్ఫీ తీసుకున్నాడు. ఒకసారి చూడు అంటూ ఫోటోతో పాటు ట్వీట్ చేశాడు నారా లోకేష్‌.
 
ముందు ఇలాంటివి గమనించు. ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు వైసిపి కార్యకర్తలు కావడం సిగ్గు చేటు. మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది సారూ అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్‌.