మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (15:54 IST)

ఆ వెధవలకి అవి లేకుండా కోసిపారెయ్యాలి : ఎమ్మెల్యే రోజా ఫైర్

ఇటీవల గుంటూరుకు చెందిన మైనర్ బాలికను ఒంగోలులో కొందరు కామాంధులు ఓ గదిలో 10 రోజుల పాటు బంధించి సామూహిక అత్యాచారం జరిపారు. వీరిలో ఓ దివ్యాంగుడు, నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు, కొదరు మైనర్లు కూడా ఉన్నారు. ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ సామూహిక అత్యాచార ఘటనకు ప్రధాన సూత్రధారి దివ్యాంగుడు కావడం గమనార్హం. 
 
దీనిపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. 10 రోజుల పాటు 16 యేళ్ళ బాలికను గదిలో బంధించి సామూహిక అత్యాచారం చేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కామాంధులకు పడే శిక్షను చూసి ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలన్నారు. 
 
ముఖ్యంగా, ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు అంటే ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వమని, ఇప్పటికే తమ సోదరి సమానురాలైన రాష్ట్ర హోం మంత్రి సుచరిత తక్షణం స్పందించి నిందితులను అరెస్టు చేయించారన్నారు. ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన ఆ వెధవలకి కఠిన శిక్ష పడాలని, వాటిని కోసిపారేస్తే సరిపోతుందని రోజా పేర్కొన్నారు.