సంబంధిత వార్తలు
- బస్టాండులో ఒంటరిగా కనిపించిన యువతి... లాడ్జీకి తీసుకెళ్లిన పోలీస్....
- తాగుబోతు భర్త.. లాగికొట్టిన భార్య..చెంపదెబ్బతో?
- పెళ్ళయి రెండేళ్ళు.. భర్త టచ్ కూడా చేయలేదు...ఆ తరువాత..?
- ''తప్పకుండా విందుకు రావాలి'' అని పిలిచిన అల్లుడు.. తీరా వచ్చాక?
- గర్భంతో వున్నాను.. ఉద్యోగానికి వెళ్లమన్న భార్య.. గొంతుకోసిన భర్త
కానిస్టేబుల్ భర్త వేధింపులు తాళలేక మృతిచెందిన భార్య..
తెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వరకట్నాన్ని నిషేధిస్తూ చట్టం చేసినప్పటికీ వరకట్న హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
అత్తారింట్లో వేధింపులు తట్టుకోలేక, పుట్టింటికి వెళ్లలేక అనేక మంది మహిళలు బలవుతున్నారు. ఉద్యోగం చేస్తున్న వారైనా, గృహిణులైనా వరకట్న వేధింపులకు గురవుతున్నారు.
తాజాగా మెదక్ జిల్లాలో అలాంటి ఘటనే వెలుగు చూసింది. కానిస్టేబుల్‌గా పని చేస్తున్న బండి శ్యాంకుమార్ కొద్ది రోజుల క్రితం రెండవ పెళ్లి చేసుకున్నాడు. కాగా మొదటి భార్య లహరిని వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు.
పుట్టింటి నుండి 10 లక్షల రూపాయలు తీసుకురావాలని బలవంతం చేసాడు. అయితే భర్త అడిగిన డబ్బులు తీసుకురాలేక, అతడి వేధింపులను తట్టుకోలేక లహరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లహరి కుటుంబసభ్యులు మెదక్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తర్వాతి కథనం
