శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 20 జూన్ 2019 (15:25 IST)

గర్భంతో వున్నాను.. ఉద్యోగానికి వెళ్లమన్న భార్య.. గొంతుకోసిన భర్త

కుటుంబ తగాదాల కారణంగా తన భార్య గర్భంగా వుందని కూడా చూడకుండా కర్కశంగా గొంతుకోసి చంపేశాడు.. ఓ భర్త. ఈ ఘటన తూత్తుకుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లా, కోవిల్‌పట్టికి సమీపంలోని సత్తిరంపట్టి అనే గ్రామానికి చెందిన వ్యక్తి మారియప్పన్ (28). ఇతని షణ్ముగ ప్రియ అనే యువతితో గత ఐదు నెలలకు ముందుగానే వివాహం జరిగింది. 
 
అయితే మారిపయ్యప్పన్ ఉద్యోగానికి సరిగ్గా వెళ్లకుండా ఇంట్లోనే గడపటంతో భార్య గొడవపడేది. సోమవారం ఇదే విధంగా భర్తతో భార్య గొడవపడింది. దీంతో ఆవేశానికి గురైన మారియప్పన్ ఇంట్లో దొరికిన కత్తితో గర్భిణీ మహిళ అనే కనికరం లేకుండా తన భార్యను గొంతుకోసి చంపేశాడు. 
 
ఈ ఘటనలో షణ్ముగ ప్రియ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆపై భర్త కూడా తన గొంతును కోసుకున్నాడు. స్పృహతప్పి పడిపోయిన మారియప్పన్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించి.. కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు.