శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (21:13 IST)

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందనీ.. భార్య తల తెగనరికి....

పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని కట్టుకున్న భర్త జీర్ణించుకోలేకపోయాడు. దీంతో కట్టుకున్న భార్య అనే కనికరం కూడా లేకుండా తల తెగనరికేశాడు. ఆ తర్వాత ఆ తలతో నేరుగా స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా కదిరాయచెరువులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కలకడ మండలం కదిరాయచెరువు గ్రామానికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తికి అమ్మాజీ అనే భార్య ఉంది. ఈ దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, అమ్మాజీకి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానం హుస్సేన్‌ను వేధిస్తూ వచ్చింది. 
 
ఈ క్రమంలో భార్య తల తెగనరికాడు. ఆ తర్వాత ఆ తలను ఒక చేత్తో, మరో చేతితో కత్తి పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.