మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (11:02 IST)

తాగుబోతు భర్త.. లాగికొట్టిన భార్య..చెంపదెబ్బతో?

తాగుబోతు భర్తతో రోజూ తలనొప్పి. ఎన్నిసార్లు తాగొద్దని చెప్పినా వినేవాడు కాడు. ఇదే తరహాలో ఆదివారం కూడా భర్త తాగి వచ్చాడు. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన భార్య అతడిని చెంపమీద బలంగా కొట్టింది. అంతే.. అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర ప్రాంతంలోని ఉత్తువళ్లిలో ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తువళ్లికి చెందిన ప్రభుస్వామి మద్యానికి బానిసయ్యాడు. మద్యంలేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. ప్రభుస్వామి తీరుతో భార్య అంబిక విసిగిపోయింది. ఎప్పట్లాగానే తాగి రావడంతో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఆవేశంలో మాటామాటా పెరిగి అంబిక తన భర్త చెంపపై గట్టిగా కొట్టింది. ఆ దెబ్బ కాస్త బలంగా పడటంతో ప్రభుస్వామి కళ్లు తేలిపోయాయి. 
 
అయితే భర్త చనిపోయాడని తెలిసి షాకితిన్న భార్య.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకుంది. కానీ ప్రభుస్వామి సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపడంతో అసలు నిజం బయటికి వచ్చింది. దీంతో అంబికను పోలీసులు అరెస్ట్ చేశారు.