తేనెతుట్టెలో వేలెట్టాడు.. అంతే ప్రాణాలను లాగేసిన తేనెటీగలు..

Last Updated: బుధవారం, 10 జులై 2019 (13:38 IST)
తేనెతుట్టెలో వేలెట్టాలంటేనే వామ్మో అంటూ చాలామంది జడుసుకుంటారు. అయితే కేరళలో ఓ వ్యక్తి తేనెతుట్టెలో వేలెట్టాడు. అంతే ఆ తేనెటీగలు ప్రాణాలను లాగేశాయి. వివరాల్లోకి వెళితే.. కేరళలోని తేనెతుట్టెలో చేతిని పెట్టిన ఓ కార్మికుడి తేనెటీగలు వెంబడించి మరీ కుట్టి చంపేశాయి. కేరళ, కన్నూరు ప్రాంతానికి చెందిన బాబు అనే వ్యక్తి.. ఓ రబ్బర్ తోటలో కూలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 
 
ఇలా రబ్బర్ తోటలో పనిచేస్తుండగా.. తెలియకుండా ఓ చెట్టుపై వున్న తేనెతుట్టెలో వేలు తగిలింది. వెంటనే ఆ తుట్టెలో వున్న తేనెటీగలు.. ఆతనిపై దాడి చేశాయి. వెంటనే చెట్టుపై నుంచి కిందికి దూకేశాడు. తోటి కార్మికులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
కానీ బాబును వెంబడించి మరీ ఆ తేనెటీగలు కుట్టాయి. శరీరం మొత్తం తేనెటీగలు కుట్టేయడంతో బాబు స్పృహ తప్పిపడిపోయాడు. అంతలో పారిపోయిన సహ కూలీలు నిప్పు కర్రలతో వచ్చారు. వెంటనే బాబును ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక బాబు ప్రాణాలు కోల్పోయాడు.  దీనిపై మరింత చదవండి :