శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 20 జులై 2019 (16:03 IST)

రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు... ఈ వీడియో చూస్తే ఎవ్వరూ...

రోడ్డు క్రాస్ చేస్తున్నారా.. ఈ వీడియో చూస్తే ఇక జడుసుకుంటారు. అవును రోడ్డు దాటేటప్పుడు నాలుగు వైపులా చూసుకుని వాహనాలు రాని సమయంలో దాటాలని రూల్స్ వున్నాయి. 


కానీ అవన్నీ పట్టించుకోకుండా రోడ్డు క్రాస్ చేసిన ఓ యువతి కేరళలో ఆస్పత్రి పాలైంది. వివరాల్లోకి వెళితే.. కేరళ, పాలక్కాడు ప్రాంతంలో ఓ యువతి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది.
 
ఆ సమయంలో ఓ బస్సు రోడ్డుపై నిల్చుంది. బస్సును దాటుకుని.. కాస్త దూరం వచ్చేలోపే వేగంగా వచ్చిన మినీ లారీ ఆమెను ఢీకొంది. ఈ ఘటనలో గాయాలపాలైన ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్డు దాటేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకుంటే ఇలాంటి పరిణామాలు తప్పవని.. ఫేస్‌బుక్ సదరు యువతి స్నేహితులు షేర్ చేశారు.