మచిలీపట్నంలో వర్షాలు.. రహదారులన్నీ జలమయం
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో తెల్లవారు జామున నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. మచిలీపట్నం ప్రధాన రహదారి మోకాళ్లు లోతు నీటిలో వుంది.
మోకాళ్ల లోతు నీటిలోనే బందరు వాసులు ప్రయాణం సాగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు చేరింది. నీటిని తోడేందుకు మచిలీపట్నం నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో రాత్రి నుoచి వీడని వర్షాలు...
గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, పిడుగురాళ్ల, జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. అదేవిధంగా పలు రహదారిపైకి వర్షపు నీరు చేరాయి. ముఖ్యంగా గుంటూరు పలు ప్రాంతాల్లో డ్రైన్స్, సైడ్ కాల్వలు, చెరువులు లేకపోవడంతో నీరు రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
డ్రైన్స్ నైట్ కోసం తోమిన గుంటలు తొమి వదిలేయటంతో ఎక్కడ గుంటలు వున్నాయో తెలియని పరిస్థితి. అదేవిధంగా రహదారులపై గుంటలు అధికంగా వున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.