శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 జులై 2019 (08:19 IST)

పింఛన్ డబ్బు కోసం తండ్రినే కడతేర్చాడు

మద్యంమత్తులో పింఛన్ డబ్బుల కోసం కన్న తండ్రినే కడతేర్చాడో కసాయి. కృష్ణాజిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... 
 
చందర్లపాడుకు చెందిన షేక్ మహబూబ్ సాహెబ్ 73 సంవత్సరాల వృద్ధుడు. ఈనెల 8వ తేదీన వృద్ధాప్య పింఛను తీసుకొని ఇంటికి వెళ్లిన సమయంలో తప్పతాగిన కొడుకు సిలార్ కూర్చుని ఉన్నాడు. తనకు ఆ పింఛను డబ్బులు ఇవ్వాలని ఆ వృద్ధుణ్ని అడిగాడు. ఎంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో వృద్ధుని పై దాడికి చేశాడు.
 
 ఘటనలో తీవ్రంగా గాయపడిన మహబూబ్ సాహెబ్ ను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు సంఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.