శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 19 జూన్ 2019 (15:33 IST)

వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం.. హత్య

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారానికి యత్నించి.. హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ప్రవీణ్ అనే వ్యక్తి డాబాపై నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ పాలజెండా ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. జక్కోజీ జగన్ రచన దంపతులకు మూడు సంవత్సరాల తరువాత పాప శ్రీత జన్మించింది. 
 
ఇటీవల రచన టైలర్ స్ట్రేట్లో ఉన్న అమ్మగారింటికి మూడు రోజుల క్రితం వచ్చింది. వేసవి తాపం ఎక్కవగా ఉండడంతో రెండవ  అంతస్థులో డాబాపై కుటుంబ సభ్యులతో అందరూ కలిసి పడుకున్నారు. ఈ క్రమంలో తల్లితండ్రులు రెండవ అంతస్తులో డాబాపై నిద్రిస్తున్న 9 నెలల చిన్నారి శ్రితను కొలేపాక ప్రవీణ్ (28) అనే యువకుడు ఎత్తుకెళ్లి హత్యచార యత్నం చేసి ఆపై హత్య చేశాడు.
 
కొద్దిసేపటికి మేల్కొన్న పాప తల్లి చిన్నారి కనిపించకపోయేసరికి కంగారు పడ్డారు. ఈమధ్యే పాకడం నేర్చుకున్న పాప మెట్ల మీద నుండి పడిపోయిందేమోనని భావించి చుట్టుపక్కల వెతికారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ కాలనిలో వెతికారు. 
 
ప్రవీణ్ టవల్‌లో చిన్నారిని పట్టుకొని వెళ్లడం చూసిన కుటుంబ సభ్యులు అతని నుండి పాపను తీసుకొనే ప్రయత్నం చేశారు. అప్పటికే పాప తీవ్ర గాయాలు పాలయింది. చిన్నారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే చిన్నారి మృతి చెందింది. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఎంజీఎం మార్చురీ వద్ద పాప తల్లితండ్రులు విలపిస్తున్న ఘటన పలువురును కంటతడి పెట్టిస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలంటూ స్థానికులు హన్మకొండ పోలీసు స్టేషన్ సమీపంలో ఆందోళన చేశారు. రాస్తా రోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. చిన్నారిని చంపిన చోటే నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.