శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 జులై 2019 (10:28 IST)

కృష్ణా జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం.. ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ టీం

కృష్ణా జిల్లా కంచికచర్ల వీరులపాడు బత్తిన పాడు చెవిటికల్లు వద్ద పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఇసుక అక్రమంగా తరలించకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 


నందిగామ సర్కిల్ సీఐ సతీష్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఇసుక ర్యాంపులపై తనిఖీలు నిర్వహించారు. ఇసుక రవాణా చేసే వారిపై ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే రెండోసారి తరలిస్తే పి.డి యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఇసుక మాఫియాను అణచివేసేందుకు జగన్ ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కృష్ణా జిల్లా పోలీసులు కూడా తమ వంతుగా ప్రయత్నాలు చేపట్టారు.