1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Krishna: Forest department recovers 50 iguanas

చేపల మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన అమెరికా మినీ డైనాసర్లు

Krishna
ఆంధ్రప్రదేశ్‌లో చేపల మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన మినీ డైనాసర్లు వలే వుండే ఇగువానా అనే రకానికి చెందిన తొండలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


సముద్రంలో, భూమిపై నివసించే ఈ ఇగువానాలను మచిలీపట్నం చేపల మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. 
 
ఆపై అటవీ శాఖ ఆ మార్కెట్లో జరిపిన తనిఖీల్లో రెండు పెట్టెల్లోని 50కి మించిన ఇగువానాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ పట్టుకున్నారు.. అక్రమ రవాణా చేశారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఇగువానాలను అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టామని.. అటవీ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే అనుమానం పేరిట ఒకరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. 
తర్వాతి కథనం
మోడీతో పెట్టుకోవద్దని చెప్పా.. ప్చ్.. వినలేదు.. లోకేశ్‌కు అంత సీన్ లేదు: అంబికా కృష్ణ