శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 4 జులై 2019 (21:44 IST)

ఉమెన్ క్రికెట్‌ని హైలెట్ చేస్తున్న కౌసల్య కృష్ణమూర్తి సక్సెస్- మిథాలీ రాజ్

ఐశ్వర్యా రాజేష్‌, నట కిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో రూపొందుతోన్నవిభిన్న క‌థా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌`. ఈ చిత్రాన్ని  క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రంలో ప్రముఖ తమిళ్ హీరో శివ కార్తికేయన్ ప్ర‌త్యేక పాత్ర‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌ పార్క్ హయాత్ హోటల్ లో గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలి రాజ్ ముఖ్య అతిథిగా హాజరై సినిమా ట్రైల‌ర్‌, బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా ఇండియ‌న్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందిస్తూ... “ఈ వేడుక‌కి నన్ను ఆహ్వానించిన కె.ఎస్‌.రామారావు గారికి థ్యాంక్స్‌. నేను బెంగ‌ళూరులో ఉంటే న‌న్ను అక్క‌డ ప్ర‌త్యేకంగా క‌లిశారంటే సినిమా ప‌ట్ల ఆయ‌న క‌మిట్ మెంట్‌, ప్యాష‌న్ ఏంటో అర్థ‌మ‌వుతుంది. టీజ‌ర్ చూశాను. చాలా బాగా నచ్చింది. రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంది. నాకు ఎంతో బాగా న‌చ్చింది. మూవీ హ్యూజ్ స‌క్సెస్ అవుతుంది. త‌ల్లిదండ్ర‌లు ఓ అమ్మాయి క‌ల‌లు నేర‌వేర్చ‌డానికి ఎంత దోహ‌ద‌ప‌డ‌తార‌నేది ఈ సినిమాలో చూపించారు.
 
త‌మిళంలో సినిమా చేసిన కణ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు. ఎందుకంటే ఉమెన్ క్రికెట్‌ను ఓ మాధ్య‌మం ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. క‌చ్చితంగా అంద‌రికీ చేరుతుంద‌ని భావిస్తున్నాను. ఉమెన్ క్రికెట్ అనే ఆట‌ను అంద‌రూ ఎంక‌రేజ్ చేయాలని చెప్పే చిత్రం. అలాగే మ‌రో వైపు రైతుల క‌ష్టాల‌ను ఆవిష్క‌రింప చేసే చిత్రం. మా అమ్మ గారు త‌మిళ చిత్రాన్ని చూశారు. ఆమెకు ఎంత‌గానో న‌చ్చింది. నా టీమ్ మెట్స్‌కు ఈ సినిమాను చూడ‌మ‌ని చెబుతాను. అంద‌రూ క‌నెక్ట్ అవుతార‌ని భావిస్తున్నాను“ అన్నారు.