శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (18:49 IST)

శ్రీకృష్ణుడిని గోవిందా అనే నామంతో ఎవరు పిలిచారు? (video)

గోవు అంటే ఆవు. ఆలమందలతో నిరంతరం కొలాహలంగా ఉన్న నందగోకులంలో పెరిగిన శ్రీకృష్ణుని పేరు గోవిందుడు అని భాగవతంలో స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ద్వాపరయుగంలో గోవింద నామంతో విష్ణువు సుప్రసిద్దుడయ్యాడు. ఈ కృష్ణునికి గోవిందుడు అనే నామం రావడానికి గల కారణాన్ని మన పురాణాలు ఇలా చెబుతున్నాయి.
 
బృందావనంలో నందమహారాజు ఇంద్రయాగం చేయాలనుకున్నాడు. కానీ ఆ యాగాన్ని ఏడేండ్ల బాలుడైన చిన్ని కృష్ణుడు వద్దన్నాడు. గోవులు, బ్రాహ్మణులు, గోవర్దన పర్వతం ప్రీతి చెందేలా యాగం చేయమన్నాడు. ఐతే ఆ యాగం వల్ల ఇంద్రునికి కోపం వచ్చి వానను కురిపించాడు. అప్పుడు కృష్ణుడు గోవులను రక్షించాడు. అందుకు సురభి అనే గోవు దేవతలు, మహర్షుల సమక్షంలో చిన్ని కృష్ణుడికి క్షీరాభిషేకం చేసి గోవిందుడు అనే నామాన్ని ఇచ్చింది.
 
ఈవిధంగా గోగణ రక్షణం చేసి దేవదేవుడైన శ్రీకృష్ణుడు గోవిందుడిగా ప్రసిద్ది చెందాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోవిందుడుగా ఉన్నాడు. కాబట్టే కలియుగంలో కూడా ఆ గోవింద నామాలనే భక్తుల చేత పలికిస్తూ పరవశం చెందుతున్నాడు.