మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (16:01 IST)

నందిగామలో ఆ రోజు అర్థరాత్రి ఏం జరిగింది?

నందిగామ మున్సిపల్ పరిధిలో గల వాటర్ ట్యాంక్ వద్ద గత 15 సంవత్సరాల క్రితం పంచాయితీ అనుమతులు అని, అసలు దీనికి అనుమతులు ఉన్నాయా లేవా, అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. అనుమతులు ఉంటే... గత మూడు రోజుల క్రితం అర్థరాత్రి వేళ మున్సిపాల్టీ ఏఈ సమక్షంలో బోరు వేయాల్సిన పని ఏమిటి? బోరు రాత్రివేళ వేయాటనికి కారణం ఏంటి? మరి ఇన్ని రోజులు ఎక్కడ నుంచి నీళ్ళు ఇస్తున్నారు?
 
నిబంధనల ప్రకారం ఐఎస్ఐ అనుమతి పొంది ఉండాలి. ఇన్నాళ్ల నుంచి లేని బోరు ఇప్పుడు ఎలా వేశారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు గుర్తొచ్చిందా, దీని గూడార్థం ఏంటి? 20 లీటరుకు వాటర్ క్యాను రెండు రూపాయలకు అందించాల్సి ఉండగా దానికి  ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి నిధులు అధికారులు జేబులు నింపేందుకు చేస్తున్నరా? అసలు ఈ వాటర్ ప్లాంట్‌కి కాలపరిమితి ఎన్నిరోజులు ఉంది రోజుకి వేల లీటర్లు నీటిని విక్రయిస్తున్నారు.
 
ప్రజల ఆరోగ్యం పాడై పోయినా ఫర్లేదు వ్యాపారం మాత్రం నిత్యం కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఈ వాటర్‌ని క్లోరైడ్ టెస్టు కూడా చేయాలి. ఈ సంగతి నగర పంచాయతీ అధికారికి తెలియదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రజలు ప్రశ్నలకు సమాధానం అధికారుల దగ్గర ఉందా? మరి కొందరు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం.