సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 1 జులై 2019 (10:57 IST)

బాల‌య్య టైటిల్‌తో అల్ల‌రి న‌రేష్... ఇంత‌కీ టైటిల్ ఏంటి..?

టాలీవుడ్‌లో హాస్య చిత్రాల కథానాయకుడుగా పేరుగాంచిన అల్లరి నరేష్, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఎపిక్ బ్లాక్‌బస్టర్ చిత్రం మహర్షిలో మహేష్ బాబుకు స్నేహితుడిగా అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రానికి ‘బంగారు బుల్లోడు’ అనే టైటిల్‌ని నిర్ణయించింది చిత్ర బృందం. ఆయన జన్మదినం కావడంతో చిత్ర టైటిల్ సహా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేసారు.
 
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన అనిల్ సుంకర సమర్పణలో సుంకర రామబ్రహ్మం నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి పివి గిరి దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన పూజ ఝవేరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మంచి వినోదాత్మకమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ మరొక్కసారి ప్రేక్షకులకు తన నవ్వులతో గిలిగింతలు పెట్టనున్నారు. మ‌రి... హీరోగా అల్ల‌రి న‌రేష్ ఈ సినిమా అయినా విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.