1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Ukraine President Zelensky talk about Russian War

ప్రపంచాన్ని కదిలించిన ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ ప్రసంగం

Ukraine President
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెనెన్ స్కీ అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆయన అంతర్జాతీయ మీడియాలకు ఇస్తున్న ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ముఖ్యంగా, తమ దేశ ప్రజల మనోభావాలు రష్యా వాళ్లకు తెలియవన్నారు. రష్యా సైనికులు తమను చంపడానికి లేదా వాళ్లు చావడానికే ఉక్రెయిన్‌పై దండయాత్రకు వస్తున్నారని ఆయనన్నారు. 
 
తాజాగా సీఎన్ఎన్, రాయిటర్స్ వార్తా సంస్థలకు సంయుక్తంగా జెలెన్ స్కీని ఇంటర్వ్యూ చేశాయి. ఇందులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో తాము యుద్ధాన్ని నిలువరించే పరిస్థితుల్లో లేమన్నారు. పోరాటమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. తుదికంటూ పోరాడుతామని తేల్చి చెప్పారు. 
 
"ఇది మా ఇల్లు, పిల్లలు చచ్చిపోతున్నారు. మా పిల్లల భవిష్యత్ కోసం మా భూమిని, మా ఇంటిని మేం కాపాడుకుని తీరుతాం" అని గద్గద స్వరంతో ఆయన చెప్పుకొచ్చారు. జీవించే హక్కును తాము కాపాడుకుంటామని చెప్పారు. రష్యా వాళ్లకు తమ ప్రజల మనస్తత్వం, తమ దేశం, తమ సిద్ధాంతాలు అర్థం కాబోవన్నారు. ఇక్కడి పరిస్థితుల గురించి వాళ్లకేం తెలియదని అన్నారు. వాళ్లు తమను చంపడానికి లేదంటే వాళ్లు చావడానికే ఉక్రెయిన్‌పై దండయాత్రకు వస్తున్నారని అన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రతి ఒక్కరినీ తీవ్ర ఆవేదనకు లోను చేస్తున్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం : ఆ అంశంపైనే కీలక చర్చ!