సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (19:27 IST)

ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీని చంపేందుకు ప్రొఫెషనల్ కిల్లర్స్!

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధంసాగుతోంది. తమకు కొరకారని కొయ్యిగా మారిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని గద్దె దించండంతో పాటు ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలన్న తపనతో రష్యా సేనలు భీకర యుద్ధం చేస్తున్నాయి. అదేసమయంలో జెలెన్ స్కీని ప్రాణాలతో పట్టుకోవడం లేదా హతమార్చేందుకు కూడా రష్యా సేనలు వ్యూహ రచన చేశాయి. ఇందులోభాగంగా, ఆయన్ను హతమార్చేందుకు ఆఫ్రికా దేశాల నుంచి 400 మంది పక్కా ప్రొఫెషనల్స్‌ను రష్యా రంగంలోకి దించినట్టు ఓ కథనం వచ్చింది. 
 
ఈ కథనం ఇపుడు సంచలనం రేపుతుంది. వాగ్నర్ గ్రూపునకు చెందిన ఈ ప్రొఫెషనల్ కిల్లర్స్ ప్రత్యేక శిక్షణ పొందినవారని, రష్యా అధినేత పుతిన్ ఆదేశాలపై వారిని ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినట్టు ఆ కథనంలో పేర్కొంది. 23 మంది అంతర్జాతీయ నేతలను చంపడే వారి టార్కెట్ అని వారికి అందించిన హిట్ లిస్టులో ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ పేరు కూడా ఉన్నట్టు ఆ కథనంలో పేర్కొంది. కాగా, వ్లాదిమిర్ పుతిన్ గతంలో రష్యా గూఢచార సంస్థ కేజీబీ ఏజెంట్ అనే విషయం తెల్సిందే.