1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Virgin Galactic space tour successful

నింగి నుంచి సురక్షితంగా భూమికి చేరిన వ్యోమనౌక

Virgin Galactic Space Tour
ప్రపంచ కుబేరుడు, వర్జిన్ గ్రూప్ సంస్థల అధినేత రిచర్డ్ బ్రాన్సన్ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. ఆదివారం నింగిలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక గంట తర్వాత సురక్షితంగా భూమికి తిరిగివచ్చింది. 
 
ఇందులో రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురు వ్యోమగాములతో కూడిన యూనిటీ-22 నౌక సురక్షితంగా భూమిపై ల్యాండైంది. భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న రిచర్డ్ బ్రాన్సన్ ఆశలకు ఈ విజయం మరింత ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.
 
కాగా, ఈ రోదసి యాత్రలో తెలుగమ్మాయి శిరీష బండ్ల పాల్గొనడం విశేషం. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసిలో ప్రవేశించిన మూడో భారత సంతతి మహిళగా శిరీష ఘనత సాధించింది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దేశంలో కొత్తగా 37 వేల కరోనా పాజిటివ్ కేసులు