1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Warning to American Citizens in Afghanistan

అఫ్ఘానిస్తాన్‌లో అమెరికన్ పౌరులకు హెచ్చరిక

Warning
అబ్బే గేట్, ఈస్ట్ గేట్ లేదా నార్త్ గేట్ వద్ద ఉన్న యూఎస్ పౌరులు వెంటనే బయలుదేరాలని కాబూల్‌లోని అమెరికా ఎంబసీ తాజాగా హెచ్చరిక జారీ చేసింది. మరో 1,500 మంది అమెరికన్లు అఫ్ఘానిస్తాన్ నుంచి తరలింపు కోసం ఎదురుచూస్తున్నట్లు యూఎస్ తెలిపింది.

తాలిబన్లు తమ చెక్‌పోస్టుల వద్ద సొంత భద్రతను పెంచుకున్నారని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ వెల్లడించారు. ఆగస్టు 31 వరకు కాబూల్ విమానాశ్రయాన్ని నిర్వహించడం మాత్రమే అమెరికా బాధ్యత అని కిర్బీ వివరించారు.

అఫ్ఘానిస్తాన్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం చుట్టూ తాలిబన్లు నియంత్రణను పటిష్ఠం చేసిన నేపథ్యంలో అమెరికా తాజాగా హెచ్చరిక జారీ చేసింది.

కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికన్లతోపాటు అప్ఘాన్లను యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ విమానాల్లో తరలింపు కార్యకలాపాలను నిర్వహిస్తోంది.కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ తాలిబన్లు నియంత్రణను ఏకీకృతం చేశారు. 
తర్వాతి కథనం
ఐదుగురికి కరోనా వస్తే మూసేయండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ సూచన