శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (10:40 IST)

ఢిల్లీకి వచ్చిన 16 మంది ఆఫ్ఘన్ నిర్వాసితులకు కరోనా

ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి ఢిల్లీకి వచ్చిన 16 మంది నిర్వాసితులకు కరోనా వైరస్ సోకింది. రాజధాని కాబుల్‌లో చిక్కుకున్న 78 మందిని ఎయిర్ ఇంఢియా విమానం(ఏఐ1956)లో కాబుల్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి వారికి కరోనా పరీక్షలు చేశారు. ఢిల్లీకి చేరిన 78 మందిలో 16 మందికి కరోనా సోకింది. కరోనా వచ్చిన వారు కేంద్రమంత్రి హర్దీప్ పూరిని కలిశారు. 
 
దీంతో కాబూల్ నుంచి వచ్చిన 78 మందిని క్వారంటైన్ చేశారు. కరోనా వచ్చిన వారిలో అసింప్టమాటిక్ అని వైద్యులు చెప్పారు. కాబూల్ నుంచి వచ్చిన వారిలో 25 మంది భారతీయులు మిగిలిన వారు అఫ్ఘాన్ సిక్కు, హిందూ కుటుంబాలకు చెందినవారు కూడా ఉన్నారు. 
 
కాబుల్‌లోని గురుద్వారా నుంచి గురు గ్రంథ సాహిబ్‌కు చెందిన మూడు ప్రతులను ఢిల్లీకి తీసుకు వచ్చి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పురికి అప్పగించారు. గతంలో అప్ఘనిస్థాన్ నుంచి వచ్చిన 146 మందిలో ఇద్దరికి కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో ముగ్గురు సిక్కులున్నారు. 
 
ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి కరోనా సోకిన సిక్కులకు స్వాగతం పలికడం కలకలం రేపింది. కాబూల్ నుంచి వచ్చిన 78 మందిని ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం 14 రోజుల పాటు చావ్లాలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ క్యాంప్‌లో క్వారంటైన్ చేశారు.