సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (16:38 IST)

ఆఫ్గనిస్థాన్‌లో భారతీయులందరూ సేఫ్: జర్నలిస్ట్ ట్వీట్

ఆఫ్గనిస్థాన్‌లో దాదాపు 150 మంది భారతీయులను సాయుధ తాలిబన్లు అపహరించినట్లు కథనాలు వెలువడడం తెలిసిందే. కాబూల్ విమానాశ్రయానికి సమీపంలో వీరిని సాయుధ తాలిబన్లు అపహరించినట్లు కథనాలు వెలువడ్డాయి. భారతీయులకు తాలిబన్లు హాని తలపెట్టవచ్చని తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయులందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
వీరితో భారత దౌత్య అధికారులు టచ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిని కాబూల్ నుంచి భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. భారతీయులను అపహరించిన తాలిబన్లు.. ఆ తర్వాత వారిని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌‌లో క్షేమంగా విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాటు విదేశాలు తీవ్రంగా స్పందించే అవకాశమున్నందునే వారికి ఎలాంటి హానితలపెట్టకుండా తాలిబన్లు విడుదల చేసినట్లు సమాచారం.
 
అటు ఆఫ్గనిస్థాన్ మీడియా వర్గాలు కూడా భారతీయులందరూ సేఫ్‌గా ఉన్నట్లు ధృవీకరించాయి. అయితే భారతీయుల నుంచి పాస్‌పోర్టులు తీసుకుని తమ వెంట ఎవరు తీసుకెళ్లారన్న దానిపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఆఫ్గన్‌కు చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.