శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (15:25 IST)

కర్నూలు జిల్లాలో భారీ మోసం : నలుగురి అరెస్టు

ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశఆరు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన కొందరు నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక ఓర్వకల్లులో పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి ఏడు లక్షలు వసూలు చేశారు. కర్నూలు డీఐజీ పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్ సృష్టించారు. 
 
రైల్వేలో ఉద్యోగాల పేరుతో అవుకు, అల్లూరులో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. ఇప్పటివరకు నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు కేసులు నమోదు చేశారు. దళారులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు