బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 25 ఆగస్టు 2021 (17:52 IST)

ఆఫ్ఘన్ ఐటీ మినిష్టర్ పిజ్జా డెలివరీ బోయ్ అయిపోయాడు

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
మాజీ ఆఫ్ఘన్ మంత్రి సయ్యద్ అహ్మద్ సాదత్ జర్మనీలో పిజ్జా డెలివరీ వ్యక్తిగా పనిచేస్తున్నారు. 
ఆఫ్ఘనిస్తాన్ మాజీ కమ్యూనికేషన్- టెక్నాలజీ మంత్రి సయ్యద్ అహ్మద్ సాదత్ ఫోటోలను అల్ జజీరా అరేబియా ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అతను 2020లో మంత్రి పదవిని త్యజించి జర్మనీకి వెళ్లాడు.
 
సాదత్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలను పొందారు. అతను ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లిన తర్వాత గత ఏడాది డిసెంబర్‌లో చేరుకున్నాడు. సాదత్ 2018లో అష్రఫ్ ఘనీ మంత్రివర్గంలో చేరారు, కానీ అతనితో విభేదాల కారణంగా 2020లో తన పదవికి రాజీనామా చేశారు. అతను తరువాత ఆఫ్ఘనిస్తాన్ వదిలి జర్మనీ వెళ్లాడు.