1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
  4. Warner 90* leads Sunrisers to first win

ఐపీఎల్ 9: సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ.. సొంతగడ్డపై ముంబైపై గెలుపు!

Warner 90* leads Sunrisers to first win
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి విజయం సాధించింది. హైదరాబాద్ రాజీవ్‌ గాంధీ స్టేడియంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఏడు వికెట్లతో ఘన విజయం గెలుపును సాధించింది. రోహిత్ సేన నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ మూడు వికెట్లు కోల్పోయి మరో 15 బాల్స్‌ మిగిలుండగానే ఛేదించింది. 
 
హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (59 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 నాటౌట్‌) అజేయ హాఫ్‌ సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మోసీ హెన్రిక్స్‌ (20) రాణించాడు. ముంబై బౌలర్లలో టిమ్‌ సౌథీ 3 వికెట్లు పడగొట్టాడు. వార్నర్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. అంతకుముందు ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 142 రన్స్‌ చేసింది.
About Writer
Selvi